పర్యావరణాన్ని కాపాడాలి

పుంగనూరు ముచ్చట్లు

పర్యావరణ కాలుష్యాన్ని కాపాడాలని కార్తీక ర్యాలీని పుంగనూరు ఎస్‌ ఐ అరుణకుమార్‌రెడ్డి చేపట్టారు. పట్టణంలోని విద్యార్థులతో కలసి ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరుచెట్లు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. అలాగే ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధించాలని సూచించారు. ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగంతో ప్రజలు ఆనారోగ్యం భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు రవిబాబు, కరింసింగ్‌, కిరణ్‌కిషోర్‌, శ్రీదేవి, మోహన్‌మురళి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *