పర్యావరణ కాలుషాన్ని నివారించండి – దేశం ఇన్‌చార్జ్ వెంకటరమణరాజు

చౌడేపల్లె ముచ్చట్లు

వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు చెట్లను అభివృద్ధి చేయాలని పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెంకటరమణరాజు పిలుపునిచ్చారు. చౌడేపల్లె ఉన్నత పాఠశాలలో కార్తీకమాసోత్సవంలో భాగంగా ఆయన చెట్లు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖాధికారి గోవిందరాజన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని రాజు ప్రారంభించి , చెట్లు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంటి వద్ద రెండు చెట్లు పెంచాలన్నారు. అలాగే ప్రభుత్వ స్థలాల్లో అడవుల పెంపకాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణం అగ్రగామిగా నిలిచిందన్నారు. పేదల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *