పవన్‌కళ్యాణ్‌తో అనుష్క సై

సంక్రాంతికి పవన్‌ సినిమాతో పాటు మరికొన్ని భారీ చిత్రాలు వస్తాయనే అనుకున్నారు. పవన్‌, త్రివిక్రమ్‌ చిత్రాన్ని జనవరి 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈలోగా మహేష్‌, కొరటాల చేస్తోన్న ‘భరత్‌ అనే నేను’ రిలీజ్‌ వాయిదా పడింది.

సంక్రాంతి నుంచి సమ్మర్‌కి అది వాయిదా పడడంతో మరో పెద్ద సినిమా విడుదలకి ఇది అవకాశమిచ్చింది. ఎలాగో రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల ‘రంగస్థలం’ కూడా వేసవికి వాయిదా పడడంతో సంక్రాంతికి పవన్‌, బాలకృష్ణ సినిమాలు మాత్రమే కన్‌ఫర్మ్‌గా కనిపిస్తున్నాయి.

సంక్రాంతికి మరికొన్ని చిత్రాలకి కూడా స్పేస్‌ వుంటుంది కనుక ఆ టైమ్‌లో విడుదల చేయాలని ‘భాగమతి’ నిర్మాతలు యువి క్రియేషన్స్‌ డిసైడ్‌ చేసారట. ఎక్స్‌ప్రెస్‌ రాజా, మహానుభావుడు చిత్రాలని కాంపిటీషన్‌లోనే వదిలిన ఈ నిర్మాతలు సంక్రాంతికి అనుష్క చిత్రాన్ని విడుదల చేయడానికి ఫిక్స్‌ అయ్యారట. పిల్ల జమీందార్‌ దర్శకుడు అశోక్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న భాగమతి ఒక థ్రిల్లర్‌ చిత్రమట. ఇది చారిత్రిక నేపథ్యమున్న చిత్రమనే ప్రచారం జరుగుతోంది కానీ అది నిజం కాదట.

గతంలో సంక్రాంతికి వచ్చిన అనుష్క చిత్రం అరుంధతి ఘన విజయం సాధించింది. అదే సెంటిమెంట్‌ దీనికీ రిపీట్‌ అవుతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. కానీ పవన్‌ సినిమా ధాటిని ఈ చిత్రం తట్టుకోగలదా లేదా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *