పాక్ క్రికెట్ బోర్డుపై మరో పెద్ద బండ!

ఇస్లామాబాద్ ముచ్చట్లు:

కష్టాల కొలిమిలో చిక్కుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మరో కష్టం వచ్చిపడింది. పీసీబీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా విండీస్ జట్టు ఆ దేశంలో ఈ ఏడాది మూడు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా పాకిస్థాన్‌కు తమ ఆటగాళ్లను పంపేందుకు విండీస్ బోర్డు వెనకంజ వేస్తోంది. సిరీస్‌ను వాయిదా వేయడమే మేలని తలస్తోంది. అదే కనుక జరిగితే పాక్ క్రికెట్ బోర్డు మరిన్ని నష్టాల్లో కూరుకుపోవడం ఖాయం.గతేడాది కూడా పాక్‌లో పర్యటించేందుకు విండీస్ జట్టు నిరాకరించడంతో తటస్థ వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉండడంతో పీసీబీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.ఇటీవల పాక్‌లో వరల్డ్ ఎలెవన్, శ్రీలంక జట్లు పర్యటించాయి. ఆయా మ్యాచ్‌లకు విశేష స్పందన లభించింది. దీంతో పాక్‌లో క్రికెట్‌కు పునర్వైభవం వస్తుందని అంతా భావించారు. మిగతా దేశాల జట్లు కూడా తమ దేశానికి వచ్చి ఆడేందుకు ఆసక్తి చూపేందుకు ఉత్సాహం చూపిస్తాయని పీసీబీ భావించింది.అయితే ఇప్పుడు విండీస్ జట్టు పాక్ వచ్చేందుకు ససేమిరా అంటుండడంతో పాక్ బోర్డు దిక్కుతోచని స్థితిలో పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *