పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్‌కు సన్మానం

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త , చైర్మన్‌ హెల్త్కేర్‌, ఎడ్యూకేషనల్‌ సొసైటి వ్యవస్థాపకులు జి.రామచంద్ర యాదవ్‌కు శనివారం ఘన సన్మానం చేశారు. పుంగనూరు నియోజకవర్గ యాదవ సంఘం ఆధ్వర్యంలో రామచంద్ర యాదవ్‌ దంపతులకు గజమాల వేసి, శ్రీకృష్ణుని విగ్రహాన్ని బహుకరించారు. రామచంద్ర యాదవ్‌ను చాంబర్‌ఆఫ్‌ కామర్స్ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌గా ఎంపిక కావడం పట్ల పలువురు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సమావేశంలో యాదవ కుటుంభాల అభివృద్ధికి సహకారం అందిస్తామని రామచంద్ర యాదవ్‌ తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి తగిన చేయూతనిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, యాదవ్‌ సంఘ అధ్యక్షుడు సుబ్రమణ్యంయాదవ్‌, తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజ యాదవ్‌, బీసీ సంఘ అధ్యక్షుడు అద్దాల నాగరాజ, సీనియర్‌ న్యాయవాది వెంకట్రమణ యాదవ్‌, ట్రాన్స్కో ఏఈ ఉమాపతియాదవ్‌, విశ్రాంత తెలుగుపండితులు గంగులమ్మ, యాదవ యువజన సంఘ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, బుడ్డన్న, ఆనందయాదవ్‌, లింగమూర్తి, నారాయణస్వామి, ప్రబాకర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *