పుంగనూరులో 7 మోటారు సైకిళ్ళు స్వాధీనం

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరు పట్టణంలో రాఘవేంద్ర అనే దొంగను పట్టుకుని 7 మోటారుసైకిళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సాయినాథ్‌ తెలిపారు. రామసముద్రం మండలం దిన్నిపల్లెకు చెందిన రాఘవేంద్ర మదనపల్లె, పుంగనూరు ప్రాంతాలలో జల్సాల కోసం ద్విచక్రవాహనాలను చోరీ చేసేవాడని తెలిపారు. 7 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని , అరెస్ట్ చేసి రిమాండుకు తరలించామన్నారు. ఈ అరెస్ట్లో ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *