పుంగనూరు సున్నిఅంజుమన్‌ కమిటి అధ్యక్షుడుగా ఇనాయతుల్లా షరీఫ్‌

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరు నియోజకవర్గ సున్నిఅంజుమన్‌ కమిటి నూతన అధ్యక్షుడుగా హాజి ఇనాయతుల్లాషరీఫ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సున్ని అంజుమన్‌ కమిటి సమావేశం సంగీన్‌జామీయా మసీదులో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడుగా ఇనాయతుల్లాషరీఫ్‌, ఉపాధ్యక్షులుగా కరీముల్లా, ఎం.సీకింధర్‌, డాక్టర్‌ ఫకృద్ధిన్‌, బాబు , కార్యదర్శిగా పి.అయూబ్‌ఖాన్‌, జాయింట్‌ సెక్రటరీలుగా ఎం.సాధిక్‌పాషా, ఎస్‌.బావాజాన్‌, కోశ్యాధికారులుగా ఎం.మస్తాన్‌. పి.యూసఫ్‌ను ఎన్నుకున్నారు. వీరితో పాటు కార్యవర్గ సభ్యులుగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 15 మందిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.నౌషాద్‌, ముస్లింలు హాజరైయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *