పెద్దిరెడ్డి ని కలిసిన నియోజకవర్గ యువనాయకులు

పలమనేరు ముచ్చట్లు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు శాసన సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని నియోజక వర్గ యువనాయకులైన జిల్లా మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి సుహేబ్ తన అనుచరులతో శుక్రవారం నాడు తిరుపతిలోని పెద్దిరెడ్డి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించినట్టు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదర్శ రాజకీయ నాయకుడు అయిన పెద్దిరెడ్డి తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని తెలిపారు. కాగా పెద్దిరెడ్డి కూడా సుహేబ్ ని శాలువా కప్పి రానున్న ఎన్నికలలో పార్టీ ని గెలిపించి తమ పార్టీ అధినేత యువనేత అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి ని చేసేందుకు యువనాయకులు అహర్నిశలు కృషి చేయాలని పెద్దిరెడ్డి సూచించారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *