పేదలకు న్యాయసేవలు అందించేందుకు కృషి చేయండి – న్యాయమూర్తి రమణారెడ్డి పిలుపు

పుంగనూరు ముచ్చట్లు

సమాజంలోని పేదలందరికి న్యాయసేవలు అందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పుంగనూరు క్రిమినల్‌ కోర్టు న్యాయమూర్తి రమణారెడ్డి పిలుపునిచ్చారు. పుంగనూరు కోర్టులో న్యాయసేవ దినోత్సవ వేడుకలను న్యాయవాదుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డెప్ప, మల్లికార్జురెడ్డి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రమణారెడ్డి న్యాయసేవ దినోత్సవ కేకును కట్‌ చేశారు. అలాగే పట్టణంలోని నక్కబండ ప్రాంతంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సభలలో న్యాయమూర్తి మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు మండల లీగల్‌సర్వీసస్‌ అథారిటి ఆధ్వర్యంలో పేదలకు సత్వరన్యాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎదురైయ్యే సమస్యలపై కమిటికి వ్రాతమూలకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. కోర్టుల్లో పెండింగ్‌ కేసులను పరిష్కరించేందుకు లోక్‌అదాలత్‌లను ఏర్పాటు చేసి, పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు చట్టం పట్ల అవగాహన పెంపొందించేందుకు న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు చిన్నచిన్న సమస్యలను గ్రామాల్లో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని , అవసరమైన సమయాల్లో మాత్రమే కేసులు దాఖలు చేసుకోవాలని సూచించారు. కక్ష్యలకు చోటు లేకుండ ప్రతి ఒక్కరు శాంతియుతమైన జీవనం సాగించాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మండల కమిటి అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎలినార్‌ ప్రశాంతి, శ్రీరాములురెడ్డి, విజయ్‌కుమార్‌, రామక్రిష్ణ, ఆనందకుమార్‌, కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *