ప్రజాసంకల్పయాత్రలో అపశృతి

ఇడుపులపాయ ముచ్చట్లు

వైఎస్సాఆర్సీపి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. సీకెదిన్నెకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన జగన్‌ వెంకటరమణకుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. జగన్‌ ప్రజా సంకల్పపాదయాత్ర సోమవారం ప్రారంభమైంది. ఇడుపులపాయలోని వైఎస్‌. సమాధి వద్ద జగన్‌ తన కుటుంబ సభ్యులతో కలసి నివాళులర్పించి పాదయాత్రను మొదలెట్టారు. ఈ సందర్భంగా జగన్‌ ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసిపిదే గెలుపని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *