ప్రమాదంలో వైసీపి నాయకుడు మృతి

పలమనేరు ముచ్చట్లు

పలమనేరు మునిసిపాలిటి లోని నీళ్ళకుంటకు చెందిన మణి అలియాస్ సుబ్రమణ్యం (50) సోమవారం సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై నుంచి పడి గాయపడ్డారు. సొంత పనుల నిమిత్తం బైరెడ్డిపల్లె కు వెళ్ళి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. తలకు బలమైన గాయం కావడంతో పలమనేరు ఏరియా ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం వేలూరు సియంసి కి తరలించారు. కోమాలోకి వెల్లిన ఆయన మంగళవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయ తెలుసుకున్న వైసీపి కో ఆర్డినేటర్లు రాకేష్ రెడ్డి, సివి కుమార్, నాయకులు చెంగారెడ్డి, మండీసుద, శశి, సుహేబ్ పలువురు నాయకులు మృతుడి ఇంటికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల ను ఓదార్చి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *