బంగాళాఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్ ముచ్చట్లు

మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అల్పపీడనం బలపడి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా ఈ నెల 18వ తేదీ నుంచి ఉత్తర కోస్తా, దక్షిణ ఒరిస్సాలో కూడా భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని.. క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వాతావరణ శాఖ సూచనలను ప్రజలు గమనించి..అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *