బండరాళ్లతో కొట్టి చంపేశారు

పుంగనూరు ముచ్చట్లు

గుర్తుతెలియని సుమారు 40 సంవత్సరాలు వయస్సు కలిగిన వ్యక్తిని అతిదారుణంగా బండరాళ్లతో కొట్టి చంపేశారు. పుంగనూరు పట్టణంలోని దోబీకాలనీ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైన శవాన్ని ఉదయం పట్టణ వాసులు కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సాయినాథ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ అరుణకుమార్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, హతుడి ఆచూకి, హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *