బాబు పాలనలో రాష్ట్రం సుభిక్షం – దేశం ఇన్‌చార్జ్ వెంకటరమణరాజు

పుంగనూరు ముచ్చట్లు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని పుంగనూరు నియోజికవర్గ ఇన్‌చార్జ్ వెంకటరమణ రాజు తెలిపారు. ఇంటింటా తెలుగు దేశం పార్టీ కార్యక్రమాన్ని పట్టణం లోని 2, 3 వార్డుల్లో చేపట్టారు ఈ సందర్భంగా వెంకటరమణరాజు పార్టీ జెండాను ఎగుర వేశారు. అక్కడ ప్రజలతో వెంకటరమణరాజు మాట్లాడూతూ రాష్ట్రంలో వర్షాలు సకాలంలో కురవడంతో ప్రాజెక్టులు, నీటితో కళకళలాడుతోందన్నారు. అలాగే అన్నిరకాల పంటలు పండి , రైతాంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రభివృద్ధి కోసం చంద్రబాబునాయుడు ఆహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తిరిగి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన జనం నమ్మేస్థితిలో లేరని, పనిచేసే వారికే పట్టం కడుతారని తెలిపారు. పార్టీ నేతలు , కార్యకర్తలు ఐకమత్యంతో తెలుగుదేశం విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య వంతులను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతలు రామక్రిష్ణం రాజు, అక్కింరమేష్‌, చంద్రశేఖర్‌, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్లు మధుసూధన్‌గుప్తా, కేశవమూర్తి, మధుసూధన్‌రాయల్‌, ఖలీల్‌, బాబు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *