బిజెవైఎం నాయకుడి హత్యను నిరసిస్తూ కొవ్వొత్తులతో నివాళులు

పెద్దపంజాణి ముచ్చట్లు

ఉగ్రవాదుల దాడిలో బిజెవైఎం నాయకుడు గౌవార్ హుస్సేన్ భాట్ అనే వ్యక్తి హత్యకు గురైన సంఘటన జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో చోటు చేసుకుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జల్లి హరిక్రిష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హత్యను అప్రజాస్వామికమైనదిగా పేర్కొన్నారు. ఈ మేరకు వారు తమ నాయకుడి హత్యను నిరసిస్తూ, శాంతియుతంగా కొవ్వొత్తులతో నివాళులర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం నాయకులు గంగాధర్, మధుబాబు, రూపేశ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *