బిహార్‌లో విషాదం: ‘టీ’లో విషం కలిసి నలుగురి మృతి

పాట్నా ముచ్చట్లు

బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కోసం టీ తయారు చేస్తున్న ఓ బాలిక తెలిసీ తెలియక అందులో పురుగుల మందు కలపడంతో నలుగురు మృతిచెందారు. ఈ సంఘటన దర్బాంగా జిల్లాలోని బహదూర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గురువారం వెలుగుచూసింది. మృతుల్లో ముగ్గురు పురుషులు ఓ పదేళ్ల బాలిక ఉన్నారు.డీఎస్పీ దిల్‌నవాజ్‌ అహ్మద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అర్చన అనే పదేళ్ల బాలిక కుటుంబ సభ్యుల కోసం టీ తయారు చేస్తూ పొరపాటున అందులో పురుగుల మందు కలిపింది. కుటుంబ సభ్యులందరు ఈ విషం కలిపిన టీ తాగడంతో నలుగురు మృతిచెందగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మృతులు దుఖాన్‌ మహ్తో(60), రామ్‌స్వరూప్‌ మహ్తో(65), అర్చన(10), ప్రకాశ్‌మెహ్తోలుగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *