బీఎస్పీ, ఎస్పీల మద్య సీట్ల ఒప్పందం ఖరారు

Date:11/01/2019
లక్నో ముచ్చట్లు:
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో పట్టు సాధించేందుకు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఎందుకు గాను సీట్ల ఒప్పందం కుడా ఖరారు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి శనివారం సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పొత్తు, సీట్ల పంపకాల గురించి ప్రకటన చేశారు. ఈ సందర్బంగామాయావతి మాట్లాడుతూ.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇది దేశ రాజకీయాల్లో సరికొత్త విప్లవానికి దారి తీస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా బీఎస్పీ 38 స్థానాల్లో, ఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మిగతా నాలుగు సీట్లను ఇతర పార్టీలకు వదిలినట్లు ఆమె తెలిపారు. అమేథి, రాయ్‌బరేలి స్థానాలను కాంగ్రెస్‌ కోసం విడిచిపెట్టినట్లు చెప్పారు.‘దేశ ప్రజల ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుంటున్నాం.
ఈ పొత్తు రెండు పార్టీల ప్రయోజనాల కోసం కాదు. భాజపాకు సమాధానం చెప్పేందుకు ఇదొక చారిత్రక సమావేశం. కోట్లాదిమంది ప్రజలు కేంద్రంలోని భాజపాపై అసంతృప్తిగా ఉన్నారు. రైతులు, నిరుద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సమాజంలోని కోట్ల మందిని కాపాడేందుకే ఈ పొత్తు. 1993లో బీఎస్పీ చీఫ్‌ కాన్షీరామ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌ కలిసి యూపీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇప్పుడు మేం కూడా అదే స్ఫూర్తితో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఎస్పీ-బీఎస్పీ పొత్తు పేదలు, కార్మికులు, యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీల కోసమే’ అని మాయవతి స్పష్టం చేశారు.‘గతంలో కాంగ్రెస్‌ బోఫోర్స్‌ కుంభకోణం వల్ల అధికారాన్ని కోల్పోతే.. ప్రస్తుతం భాజపా రఫేల్‌ వల్ల అధికారాన్ని కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ హయాంలో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే.. ప్రస్తుతం భాజపా పాలనలో అధికారికంగా ప్రకటించకపోయినా అటువంటి పరిస్థితులే నెలకొన్నాయి’ అని ఆమె దుయ్యబట్టారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకపోవడానికి గల కారణాలను మాయావతి వివరించారు.
Tags:BSP and SP seal the agreement between the two parties

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *