బీసీలు ఆర్థికంగా ఎదగాలి

ములకలచెరువు ముచ్చట్లు:

బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం మదనపల్లె డివిజన్‌ అధ్యక్షుడు మనిగే భాస్కర్‌నాయుడు అన్నారు. గురువారం మధ్యాహ్నం ములకలచెరువు మండలం కనుగొండ రాయస్వామి ఆలయ ఆవరణంలో మండల బీసీ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు వినియోగించుకోకపోవడం వలన నిధులు నిరుపయోగమౌతున్నాయన్నారు. నిధులు సద్వినియోగం కోసం ప్రతి ఐదుగురు సభ్యులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని బీసీ సంక్షేమశాఖకు ప్రతిపాదించాలని కోరారు. ఈ సంఘాలకు విరివిగా నిధులు మంజూరౌతాయని సూచించారు. అలాగే బీసీ సంఘాలను పటిష్టం చేసేందుకు ప్రతి ఒక్కరు భాధ్యతగా బావించాలన్నారు. గ్రామస్థాయిలో కమిటిలను బలోపేతం చేస్తామన్నారు. బీసీలోని ప్రతి కులాన్ని గుర్తించి, వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇతర బీసీ కులాలను కూడ కలుపుకుని , సమిష్టిగా సమస్యలపై పోరాటాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వ పథకాలకు ధరఖాస్తు చేసుకున్నా మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తికొండ త్యాగరాజు, నాగమల్లప్ప, కక్కల వెంకట్రమణ, గొల్టి శీన తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *