బుర్ఖాలో లాయర్ ఇంటికి వచ్చిన హనీ ప్రీత్

రెండు నెలలుగా బృందాలుగా విడిపోయి దేశసరిహద్దులు, నేపాల్, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో నిఘా పెట్టిన పోలీసులకు సవాల్ విసిరిన డేరాబాబా గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీ ప్రీత్ ఇన్సాన్ ను ఢిల్లీ వీధుల్లో చూసి షాక్ తిన్నారు. డేరాబాబా ఆశ్రమాన్ని వీడిన హనీ ప్రీత్ ఢిల్లీలో తలదాచుకుంటోంది. నిన్న మధ్యాహ్నం ఆమె న్యాయవాది ప్రదీప్ ఆర్య నివాసానికి వెళ్లి ముందస్తు బెయిల్ పేపర్లపై సంతకం పెట్టింది. దీనిపై ఆయనను మీడియా ప్రశ్నించగా, ఆమె నేపాల్ లేదా మరో దేశం పారిపోలేదని, భారత్ లోనే, దేశ రాజధానిలో ఉందని అన్నారు. దీంతో లాయర్ ప్రదీప్ ఆర్య నివాసానికి వచ్చేదారిలో సీసీ పుటేజ్ పై దృష్టిసారించిన పోలీసులు, హనీప్రీత్ ఇన్సాన్ ఆచూకీ కనిపెట్టారు. బుర్ఖా ధరించిన హనీప్రీత్ నడుచుకుంటూ న్యాయవాది నివాసానికి వచ్చింది. అనంతరం అలాగే వెళ్లిపోయింది. దీంతో ఆమె ఢిల్లీలోని కైలాష్ పార్క్ పరిసరాల్లో ఉంటుందని భావించి గాలింపు చేపట్టారు. ఆమెను పట్టుకుంటామని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *