బెజవాడ రౌడీలకు చంద్రబాబు హెచ్చరికలు

విజయవాడ ముచ్చట్లు :

బెజవాడలో రౌడీయిజం పెరిగిపోతోందంటూ వాంబే కాలనీ మహిళలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. విజయవాడలోని పలు ప్రాంతాలలో సీఎం చంద్రబాబు ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాంబే కాలనీలో పర్యటిస్తున్న ఆయనకు మహిళలు రౌడీయిజంపై ఫిర్యాదు చేశారు.వెంటనే స్పందించిన సీఎం ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ పెంచాలని పోలీసు కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు. మళ్లీ రౌడీయిజం అనే మాట వినబడకూడదని, రౌడీ ఇజం చేసే వారిని గుర్తించి బహిష్కరించాలని చెప్పారు.ప్రొఫెషనెల్ రౌడి లు ఇంకా కొందరు ఉన్నారు.వారు మారాలి.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఉంటే రాష్ట్రం వదిలి పెట్టి వెళ్ళండి.నన్ను తక్కువ అంచనా వేయద్దు.రౌడీ ఇజం చేయాలని చూస్తే నేను సహించను.అంటూ విజయవాడ రౌడీల కు చంద్ర బాబు గట్టి వార్నంగ్ ఇచ్చారు.దీనితో పోలీసు వారు రౌడీలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు.రౌడీల ఆగడాలు కట్టి పెట్టాలని సీఎం, పోలీసులకు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ప్రాంతం లో నేరాల సంఖ్య పెరగరాదని నేరస్తుల ఆగడాలు ఇకపై విజయవాడ లో సాగరాదని వారి ఉనికి పై కఠినం గా వ్యవహరించాలి అని బాబు పోలీసులకు స్వయం గా ఆకస్మిక తనికీల్లో భాగంగా తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *