బోయకొండ ఆలయంలో భక్తులకు శఠగోపం – అమ్మవారి సేవలకు రెట్టింపు ధరలు – భక్తులకు సౌకర్యాలు ఎక్కడ – మండిపడుతున్న భక్తులు

చౌడేపల్లె ముచ్చట్లు

ఆంధ్ర రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో నాల్గవ ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలసిన శ్రీ బోయకొండ ఆలయం చౌడేపల్లె మండలంలోని దిగువపల్లె గ్రామ కొండల్లో వెలసింది. డిప్యూటి కమిషనర్‌ హ్గదా కలిగిన ఆలయంలో సంవత్సరానికి రూ.12 కోట్ల ఆదాయం వివిధ మార్గాలలో లభిస్తోంది. ఇలా ఉండగా శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం గత పది సంవత్సరాలుగా వివాదాలు చెలరేగి ఇష్టారాజ్యంగా పరిపాలన సాగుతుండటంతో రాష్ట్ర హైకోర్టులో ఈ కేసులు విచారణలో ఉన్నాయి. ఇలా ఉండగా ఆలయ ఈవో రమణమ్మ అమ్మవారి సేవల ధరలను రెట్టింపు చేస్తూ ప్రకటన జారీ చేయడం వివాదాలకు దారితీస్తోంది. ప్రకటనలో అభ్యంతరాలు కోరారు. కానీ ఆలయంలో ఈ మాదిరి ప్రకటనలు ఇచ్చి అమలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఆదాయం కలిగిన ఆలయంలో భక్తుల సౌకర్యాలు గూర్చి పట్టించుకునే వారు లేకపోయారు. కొంత మంది స్వార్థపరులు అమ్మవారి ఆలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చివేస్తున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లా పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి చర్యలు తీసుకుని , అమ్మవారి సేవల ధరలను పెంచకుండ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సేవల ధరలను పెంచుతూ ఈవో విడుదల చేసిన ప్రకటన :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *