బ్రేకింగ్ : 200 మందిని చంపేసిన హైడ్రోజన్ బాంబ్ టెస్ట్!

ఉత్తర కొరియా, అమెరికా మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే… మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే అంటున్నారు విశ్లేషకులు… ఉత్తర కొరియా దూకుడుగా వ్యవహరిస్తుంటే… కిమ్‌కు కళ్లెం వేసేందుకు దేనికి వెనుకాడబోం అంటున్నారు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అయితే అగ్రదేశానికి సవాల్ విసిరేందుకు ఉత్తర కొరియా గత నెల నిర్వహించిన అణు పరీక్ష… ఇతర దేశాల ప్రజలను ఏమోగానీ… ఆదేశ ప్రజలనే 200 మందిని పొట్టనబెట్టుకున్నట్టు జపాన్ మీడియా పేర్కొంది.ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబ్ టెస్ట్ నిర్వహించిన ప్రాంతంలో టన్నెల్ కూలి ఆ 200 మంది మరణించారని జపాన్‌కు చెందిన టీవీ అసాహి ఈ రోజు వెల్లడించింది. హైడ్రోజన్ బాంబ్ ఎఫెక్ట్‌తో నిర్మాణంలోని టన్నెల్ కూలి 100 మంది మరణిస్తే… వారిని కాపాడే ప్రయత్నం చేస్తుండగా… టన్నెల్ మరో భాగమూ కూలడంతో మరో 100 మంది మృతిచెంది… మృతుల సంఖ్య 200కు చేరిందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *