బ్రేకింగ్…..

తిరుమల….

ప్రజా సంకల్ప యాత్రకు ముందు వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉదయం నైవేద్య సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.వైఎస్‌ జగన్‌ వెంట వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, వర ప్రసాద్‌, మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది రెడ్డి, రోజా, చెవిరెడ్డి తో పాటు పలువురు పార్టీ  నేతలు ఉన్నారు.దర్శనం అనంతరం రంగనాయకులు మండపం చేరుకున్న వైఎస్‌ జగన్‌ను వేద పండితులు ఆశీర్వదించారు.అనంతరం మాట్లాడిన వైఎస్‌ జగన్‌.. ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని శ్రీవారిని కోరకున్నట్లు చెప్పారు.ప్రజా సంకల్ప యాత్ర నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమై, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *