భారీ వర్షాలకు కూలిన ఇంటి పైకప్పు… నలుగురు మృతి

బెంగళూరుముచ్చట్లు

వరుసగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం కర్నాటకలోని గజేంద్రగఢ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను మెహబూబి, ఆమె మనవరాళ్లుగా గుర్తించారు. దీనిపై గజేంద్రగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఎజిపురా ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఓ నివాసభవనంలోని కొంతభాగం కూలిపోయింది. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *