భూ ఆక్రమణ కేసులో దోషులకు కఠిన శిక్ష విదించాలి. – జిల్లా కలెక్టర్ కు మంత్రి అమర్ ఆదేశం

పలమనేరు ముచ్చట్లు

పెద్ద పంజాణి మండలంలోని ముత్తుకూరు,బొమ్మరాజుపల్లె,వీరప్పల్లె పంచాయతీలలో జరిగిన భూ ఆక్రమణలు విషయం తెలిసిందే. ఈ విషయం పై పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి సోమవారం తమ సొంత గ్రామమైన కెళవాతి లో ప్రస్తుత తహశీల్దారు సురేంద్ర తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టరు ప్రద్యుమ్న తో చరవాణిలో మాట్లాడారు. భూ ఆక్రమణలకు పాల్పడిన అప్పటి తహశీల్దారు శ్రీదేవి,ఆమెకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ను ఆదేశించారు.ఇకపై ఇలాంటి భూ ఆక్రమణలు జరుగకుండా రెవిన్యూ విభాగంలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. మండలంలోని 25 రెవెన్యూ పంచాయతీలలో రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించి తగిన నివేదికలు తమకు అందజేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండలఅధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *