మంత్రి హ్యాండ్‌ బ్యాగ్‌ కొట్టేశారు..!

భువనేశ్వర్‌ ముచ్చట్లు:

పూరి-దుర్గ్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒడిశా మంత్రి ఉషా దేవి హ్యాండ్‌బ్యాగ్‌ను దొంగలు అపహరించుకుపోయారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైరఖోల్‌- అంగుల్‌ స్టేషన్ల మధ్య హ్యాండ్‌ బ్యాగ్‌ అపహరణకు గురైనట్లు ఆమె గుర్తించారు. భువనేశ్వర్‌ నుంచి ఆమె వేరే ప్రాంతానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై వెంటనే ఆమె తితాల్‌గఢ్‌ గవర్నమెంట్‌ రైల్వే పోలీసు(జీఆర్‌పీ)లకు ఫిర్యాదు చేశారు.హ్యాండ్‌ బ్యాగ్‌లో రూ.25వేల నగదు, మొబైల్‌ ఫోన్‌, మంత్రి ఐడీ కార్డుతో పాటు మరికొన్ని విలువైన వస్తువులు ఉన్నట్లు ఆమె తెలిపారు.మంత్రి ఉషాదేవి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తితాల్‌గఢ్‌ జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌ఛార్జి మోహన్‌ నాయక్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *