మలయా తీరంలో అల్పపీడనం.. వర్ష సూచన..!

విశాఖపట్నం ముచ్చట్లు:

మలయా ద్వీపకల్పంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఆవరించింది. అల్పపీడనం రానున్న 24 గంటల్లో అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా దక్షిణకోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడనదోణ్రి ఆదివారం నాటికి తమిళనాడు ఈశాన్య ప్రాంతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుముతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో చలి ప్రభావం కొనసాగింది. ఆదిలాబాద్‌లో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణాగ్రత నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *