మాతృబాషలో కేసులు తీర్పు ఎంతో ఉపయోగకరం – తె లుగులో తీర్పు వెలువడి 20 నెలలు – రికార్డు సృష్టించిన న్యాయమూర్తి కె.మోతిలాల్‌

  • పాలకొల్లు ముచ్చట్లు

మాతృ-బాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పుంగనూరు న్యాయస్థానంలో తె లుగు బాషలో అనువధించి తీర్పు వెలువడి ఏడాదికావస్తోంది. పుంగనూరు ప్రిన్సిపుల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జిగా పని చేస్తున్న న్యాయమూర్తి కె.మోతిలాల్‌ రికార్డు స్రృష్టించారు. ప్రస్తుతం ఆయన బదిలీపై పాలకొల్లు న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. పుంగనూరు న్యాయస్థానంలో విచారణలో ఉన్న చౌడేపల్లె మండలం కొలింపల్లెకు చెందిన పి.వెంకట్రమణ అనే వ్యక్తికి చెందిన కేసు నెంబరు: 291/2015 లో విచారణ జరిపి న్యాయమూర్తి తెలుగుబాషలో గత సంవత్సరం మాతృబాష దినోత్సవం రోజున తీర్పును వెలువరించారు. ఆనాటి నుంచి న్యాయమూర్తి తన పరిపాలన కార్యక్రమాలను అంచలంచలుగా తెలుగుబాష వాడుకను తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మోతిలాల్‌తో మాట్లాడగా తెలుగుబాషపై ఉన్న అభిమానంతో పాటు తెలుగుబాషలో తీర్పులు, ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగితే ప్రజలకు తమ సమస్యలు గూర్చి , తమ తీర్పులు గూర్చి అవగాహన చేసుకునేందుకు వీలుంటుందన్నారు. పొరుగు రాష్ట్రలలో  మాతృబాషకు అధిక ప్రాధాన్యత ఉందన్నారు. ఇందులో భాగంగా తెలుగుబాషను అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నామన్నారు. సమాజంలో మాతృబాషలకు అధిక ప్రాధాన్యం లభిస్తే అన్ని వర్గాలకు చేయూత లభిస్తుందన్నారు. గత సంవత్సరం నుంచి తెలుగుబాషకు గుర్తింపు లబిస్తోంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు సమిష్టిగా తెలుగుబాష అభివృద్ధి కోసం కృషి చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *