మౌళిక వసతులు కల్పించని ప్రభుత్వాలు

తంబళపల్లి ముచ్చట్లు

ప్రజలకు మౌళిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైయ్యాయని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్‌ నారాయణ్‌ విమర్శించారు. బుధవారం చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలోని సురాజ్య యాత్రలో భాగంగా బి.కొత్తకోటకు వచ్చారు. ఇక్కడ ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానాలలో భాగంగా మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు వలన సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ఈ నోట్ల రద్దు వలన ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి మాత్రమే ప్రయోజనం కలిగిందన్నారు. రాజకీయంగా ప్రచారం చేసుకునేందుకు ఇది ఉపయోగపడిందన్నారు. క్రింద ప్రభుత్వం దేశ ప్రజలకు ఆర్థిక ఎదుగుదల కోసం పథకాలు అమలుచేయలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో సంపద వృద్ధి ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నించారు. మంచినీరు, విద్యుత్‌, రహదారులు , నాణ్యమైన విద్య ఇంక ప్రజలకు అందలేదని విమర్శించారు. రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వాలు రూ. 2లక్షల పరిహారం ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కావాల్సింది పరిహారం కాదని, వారు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *