రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటన

అరుణాచల్ ప్రదేశ్ ముచ్చట్లు 

రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు.ఆ పర్యటన పట్ల ఇవాళ చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.వివాదాస్పద ప్రాంతానికి రక్షణ మంత్రి వెళ్లడం ఆ ప్రాంత శాంతి వాతావరణాన్ని దెబ్బతీస్తుందని చైనా పేర్కొన్నది.అరుణాల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో ఉన్న ఫార్వర్డ్ ఆర్మీ పోస్టును రక్షణ మంత్రి నిర్మల విజిట్ చేశారు.ఆర్మీ సంసిద్ధత గురించి తెలుసుకునేందుకు ఆమె ఈ పర్యటన చేపట్టారు.అయితే దీనిపై స్పందిస్తూ.. చైనా అభిప్రాయాలను కూడా భారత్ తెలుసుకోవాలని.. ఆ దేశ విదేశాంగ ప్రతినిధి హువా చున్‌యుంగ్ మీడియాకు తెలిపారు.చర్చల ద్వారా వివాదాస్పద ప్రాంతంలో ఉన్న ఉద్రిక్తతను చల్లార్చాలని ఆమె అభిప్రాయపడ్డారు.ఆ దిశగా భారత్ చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు.దక్షిణ టిబెట్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఓ భాగమని చైనా భావిస్తున్నది.ఆ ప్రాంతానికి ఉన్నత అధికారి ఎవరు వెళ్లినా చైనా ఇలాంటి అభ్యంతరాలే వ్యక్తం చేస్తున్నది.చైనా, భారత్ మధ్య 3488 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *