రాజస్వామి మూడవ సత్ర ప్రాంగణములో ప్రారంభమవుతాయి.

Date: 07/01/2018

తిరుపతి ముచ్చట్లు:

జనవరి 8,9 తేదీల్లో ఉదయం 5.00 గంటల నుండి 7.00 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటల నుండి 12.00 గంటల వరకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాల భజన మండళ్లతో సంకీర్తన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.00 గంటల నుండి 6.00 గంటల వరకు ధార్మిక సందేశం కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.జనవరి 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి మూడవ సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. అలిపిరి పాదాల మండపంలో జనవరి 10 తేదీ ఉదయం 4.30 గంటలకు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠము శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామిజీ మరియు అధికార ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీపి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Tags : The Rajaswamy starts at the third Satra premises.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *