రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితలపై గద్దర్ నాటకం

హైదరాబాద్ ముచ్చట్లు:

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై ప్రజా గాయకుడు గద్దర్ నాటకం ప్రదర్శించారు. సికింద్రాబాద్‌లో జరిగిన టీమాస్ సమావేశంలో ఆయన ఈ నాటకాన్ని ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేకున్న కొత్త సచివాలయ నిర్మాణం చేస్తోందని అన్నారు. కంటోన్మెంట్ అంటేనే మిలిటరీ ఏరియా అని అక్కడ నిర్మాణం చేయడం అంటేనే భూ సమస్య అని అన్నారు. కంటోన్మెంట్‌లో ప్రభుత్వం నిర్మాణాలు చేయాలంటే ముందుగా ప్రజల ఆమోదం పొందాలని తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతంలో పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ఎందరో వీరులు నివాసమున్నారని గుర్తు చేశారు. దళితులు, బహుజనులకు ప్రభుత్వం బైసన్‌పోల్ గ్రౌండ్స్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *