రా ష్ట్రానికి చంద్రబాబు తలమానికం-శ్రీనాధ్‌ రెడ్డి, వెంకటరమణ రాజు

పుంగనూరు ముచ్చట్లు

రా ష్ట్రానికి  చంద్రబాబు నాయుడు తలమానికం వంటి వారని పుంగనూరు నియోజికవర్గ నేతలు శ్రీన్యాథ్‌రెడ్డి, వెంకటరమణ రాజు పేర్కొన్నారు. ఇంటింటా తెలుగు దేశం పార్టీ కార్యక్రమాన్ని పట్టణం లోని భగత్‌ సింగ్‌ కాలనీలో చేపట్టారు ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగుర వేశారు. అక్కడ ప్రజలతో మాట్లాడూతు రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోని భారత్‌ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. రాష్ట్ర విభజనతో ర్ఖా•నికి నిధులు కొరత లేకుండ చేసేందుకు విదేశియులను పిలిపించి వేలాధి కోట్లు పెట్టుబడి పెట్టించిన ఘనత తెలుగు దేశంకు దక్కిందన్నారు. నూతన రాజధాని అమరావతిని నిర్మించి దేశంలో అన్ని రంగాల్లోను అగ్రగామిగ నిలిపారని కొనియాడారు. రైతులకు రుణ మాఫి పెన్షన్లు, చంద్రన్న భీమ, ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకాలు ప్రవేశ పెట్టి అర్హులైన పెదలంరికి అందజేయడం జరిగిందన్నారు . ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టిన తెలుగు దేశం ప్రభుత్వానికి అండగా నిలవాలని తిరిగి, ముఖ్యమంత్రి గా చంద్రబాబు చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేతలు రామక్రిష్ణం రాజు, గాజుల సుబ్బరాయప్ప,మధుసూధన్‌రాయల్‌, కేశవమూర్తి, కుమ్మరవీధి ఖలీల్‌, బాబు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *