రేవంత్ ఆత్మీయ సమావేశానికి ఉత్తమ్: కెసిఆర్‌పై ఫైర్

హైదరాబాద్ ముచ్చట్లు:

రేవంత్‌రెడ్డి సోమవారం నాడు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి పిసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హజరయ్యారు. ఉత్తమ్‌తో పాటు ఆ పార్టీ అధికార ప్రతినిధి మల్లు రవి కూడ హజరయ్యారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వనించేందుకు ఉత్తమ్ ఈ సమావేశానికి హజరయ్యారు.రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కీలక టిడిపి నేతలు ఈ సమావేశానికి హజరయ్యారు. రేవంత్‌తో పాటు టిడిపి కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హజరయ్యారు.రేవంత్‌రెడ్డి తాను టిడిపిని ఎందుకు వీడాల్సి వచ్చిందో ఈ సమావేశంలో ప్రకటించారు. కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఏ రకంగా ఉద్యమం చేసింది. తనకు అత్యంత ఇష్టమైన నేత చంద్రబాబునాయుడును వీడాల్సి ఎందుకు వచ్చిందో ఈ సమావేశంలో ప్రకటించారు.వేం నరేందర్‌రెడ్డి. 35 ఏళ్ళుగా టిడిపితో ఉన్న అనుబంధాన్ని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నామని మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి ప్రకటించారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులే ఇందుకు అద్దం పడుతున్నాయని వేం నరేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డిపై విశ్వాసంతో ఉన్నారు. రాష్ట్రంలో అనైతిక పాలనకు చరమగీతం పాడేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు.కెసిఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్దంగా ఉన్నామని వేం నరేందర్‌రెడ్డి చెప్పారు.మల్లు రవితెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించేందుకు గత రోజులుగా ప్రయాణం సాగిస్తున్నారు.నైతిక విలువలకు కట్టుబడి రేవంత్‌రెడ్డి పార్టీకి, పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు కూడ రాజీనామా చేసి మంచి సంప్రదాయాన్ని నెలకొల్పారని చెప్పారు.బాబుకు అత్యంత విశ్వాసపాత్రుడిని, నమ్మకమున్న వ్యక్తిని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన నేతృత్వంలో శిక్షణ పొందిన వాడిని రేవంత్ రెడ్డి చెప్పారు.దేశ రాజకీయాలను మలుపులు తీప్పే బాబు నేతృత్వంలో పనిచేసిన వ్యక్తినని రేవంత్ రెడ్డి చెప్పారు. . అమరావతి కోసం నిద్రాహరాలు మారి పోరాటం చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.ఏపీ రాష్ట్రంలో అభివృద్ది కోసం చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ, తెలంగాణలో నడిస్తే తప్పా అని రేవంత్ ప్రశ్నించారు.టిడిపి అభిమానులకు నా ఆవేదనను పంచుకోవాలని భావిస్తున్నాను. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కెసిఆర్ పనిచేయడం లేదు. నాకు అత్యంత ఇష్టమైన నాయకుడిని, పార్టీని దండం పెట్టి, పార్టీని వదిలిపెట్టిన విషయమై ఆలోచించాలని రేవంత్‌రెడ్డి టిడిపి శ్రేణులకు కోరారు.తాను ఆషామాషీగా పార్టీ ఫిరాయింపు కాదన్నారు నా నిర్ణయాన్ని నిండు మనస్సుతో ఆదరించాలని రేవంత్‌రెడ్డి టిడిపి శ్రేణులను కోరారు.తెలంగాణలో నిరుద్యోగ యువత కోసం కెసిఆర్ ఒక్క క్షణం కూడ ఆలోచించలేదని రేవంత్ ఆరోపణలు గుప్పించారు.ఎన్నికల్లో ఇచ్చిన హమీలను కెసిఆర్ అమలు చేయలేదని రేవంత్ ఆరోపణలు చేశారు. 14 ఏళ్ళ ఉద్యమంలో ఏనాడూ చెప్పని విషయాలను 40 నెలల కాలంలో అమలు చేస్తున్నారని కెసిఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కనీసం ఈ హమీలను అమలు చేయకుండా వ్యాపారాలు, టీవీ ఛానెల్, పేపర్ పెట్టారని రేవంత్ సీఎం పై విమర్శలు గుప్పించారు. తన కొడుకు కోసం కొత్త సెక్రటేరియట్ కట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తన కుటుంబ సభ్యుల విలాస జీవితం కోసం లక్షల కోట్లను ప్రభుత్వ ధనం వినియోగిస్తున్నారని రేవంత్ ఆరోపణలు చేశారు.. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామాకాలు లేవని రేవంత్‌రెడ్డి చెప్పారు.తెలంగాణలో టిఆర్ఎస్‌తోనే బిజెపి నేతలు అంటకాగుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు టిఆర్ఎస్ బిజెపి అనుకూలంగా వ్యవహరించిన విషయాన్ని రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. బిజెపికి చెందిన కొందరు కీలక నేతలు ఈ విషయాన్ని తనతో ప్రస్తావించారని చెప్పారు. తెలంగాణ టిడిపిలో లేదని బిజెపి నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆయన చెప్పారు. టిడిపితో పొత్తు వద్దని కెసిఆర్‌తో స్నేహహస్తాన్ని బిజెపి నేతలు కోరుకొన్నారని రేవంత్ ఆరోపణలు చేశారు.2007లో టిడిపిలో చేరే సమయంలో ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుబంతో తనకు సన్నిహిత సంబంధాలున్న విషయాన్ని కూడ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాదు ప్రతిపక్షంలో ఉంటనే ప్రజలకు మేలు కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కారణాలతోనే తాను 2007 ఎన్నికల సమయంలోనే టిడిపిలో చేరినట్టు చెప్పారు. చంద్రబాబునాయుడు తనకు అత్యంత ఇష్టమైన నేతగా రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *