రైల్వే జోన్ ఇవ్వాల్సిదే  అసెంబ్లీ లో ముఖ్య మంత్రి చంద్రబాబు

 రైల్వే జోన్ ఇవ్వాల్సిదే
అసెంబ్లీ లో ముఖ్య మంత్రి చంద్రబాబు
అమరావతి, మార్చి 13,
ఇప్పుడున్న సెక్రటేరియట్, అసెంబ్లీ బాగానే ఉన్నాయి, కానీ హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు కన్నా మిన్నగా ఉండాలి, ఇప్పుడున్న సంక్షోభం ను అవకాశము గా మలుచుకొని తెలుగు ప్రజలు గర్వపడేలా రాజధానిని నిర్మించుకోవాలని  ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మంగళవారం అయన శాసనసభలో మాట్లాడారు. ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేనప్పుడు ఎన్టీఆర్ వచ్చారు. అందరిని ఒక్కతాటికి తీసుకువచ్చి మార్పు తీసుకుకొచ్చారు. హైదరాబాద్ లో ఉన్న సమయంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వాన్ని నడిపా. రాజకీయలు మాట్లాడటం లేదు…కేవలం రాష్ట్రానికి మేలుచేయమని కోరుతున్నామని అయన స్పష్టం చేసారు. అరుణ్ జైట్లీ మాట్లాడింది కరెక్ట్ కాదు. విష్ణుకుమార్ రాజు మీ ఆస్తి కోల్పోయినప్పుడు మీకు ఎంత బాధ ఉంటుందో….హైదరాబాద్ కోల్పోయినప్పుడు అంతే బాధ కలిగిందని అన్నారు. కేంద్రం నుంచి సహకారాన్ని మాత్రమే కోరుతున్నాం. కేంద్రం నుంచి రావాల్సింది చాలా ఉంది. విభన తర్వాత కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు సహాయం చేయకపోవడం పై ఆవేదన కలుగుతుందని అయన అన్నారు.  ఏడు  ముంపు మండలాలను ఏపీ లో కలపాలని బిజెపి ప్రభుత్వన్నీ గట్టిగా డిమాండ్ చేశాను. పోలవరం ప్రాజెక్టును పూర్తి చెయ్యాలంటే 54,000 కోట్లు ఖర్చు అవుతాయి. పోలవరం ఏపీ కి జీవనాడీ. రాష్ట్ర అభివృద్ధి లో అడ్డుకుంటున్నారని అయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రత్యేక హోదా ఇవ్వాలిసిన బాధ్యత కేంద్రం పై ఉంది. మోడీ పాలన పై నమ్మకం ఉంటే వైసిపి అవిశ్వాసం తీర్మానం ఎందుకు ప్రవేశపెడుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. రైల్వే జోన్ రాష్ట్ర హక్కు ఖచ్చితంగా కేంద్రం ఇవ్వాలని అయన డిమాండ్ చేసారు.
ఈ సందర్బంగా అయన పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలు కేంద్రం అమలుచేయాలని ఏపి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని అసెంబ్లీ ఎకగ్రీవంగా అమోదించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *