రోడ్డు ప్రమాదంలో ఏఎస్సై మృతి..

చాగలమర్రి ముచ్చట్లు:

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం నగళ్లపాడు వద్ద 40వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనం డివైడరును ఢీకొన్న ఘటనలో ఏఎస్సై మృతి చెందారు. స్థానిక ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. ఉయ్యాలవాడ ఏఎస్సైగా పనిచేస్తున్న రాధాకృష్ణ (50) శనివారం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై చాగలమర్రికి తిరుగు పయనమయ్యారు. నగళ్లపాడు సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తూ డివైడరును ఢీకొట్టారు. దీంతో తీవ్రంగా గాయాలపాలైన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *