రోడ్డు ప్రమాదాలను నివారించడి. డిఎస్పీ చౌడేశ్వరి.

పలమనేరు ముచ్చట్లు

రోజు రోజుకు పెరిగి పోతున్న రోడ్డు ప్రమాదాలను నివారించాలని పలమనేరు డిఎస్పీ చౌడేశ్వరి తెలిపారు. శుక్రవారం నాడు పలమనేరు పరిధిలోని కేటిల్ ఫాం వద్ద గల జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా ఆమె శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల కురసిన వర్షాలకు రోడ్డుకు ఇరువైపులా ఏర్పడిన గుంతలను జెసిబి సాయంతో పూడ్చివేసి, పెరిగిపోయిన మొక్కలను తొలగించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రమాదాలను నివారించడానికి రోడ్డు భద్రతా నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పెద్దపంజాణి ఎస్సై రాజశేఖర్ తో పాటు వైసిపి యువనాయకులు జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి సుహేబ్, పట్టణ విద్యార్థి నాయకులు క్రిష్ణప్రసాద్, రంజిత్,వినాయక, హనుమంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *