వర్మ సేవలకు సత్కారం

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌గా కెఎల్‌.వర్మ చేపట్టిన విస్తతమైన సేవలకు ఘన సత్కారం చేశారు. లయన్‌ సంఘం ఆధ్వర్యంలో సరళ ఆసుపత్రి అధినేత డాక్టర్‌ సరళ కమిషనర్‌ వర్మకు శ్యాలువ కప్పి , పుష్పగుచ్చం అందజేసి, సన్మానించారు. ఈ సందర్భంగా వైఎస్సాఆర్సీపి నాయకుడు రెడ్డెప్ప మాట్లాడుతూ కమిషనర్‌ వర్మ సేవలు మరువలేనిదన్నారు. రెండు సంవత్సరాల కాలంలో పుంగనూరు పట్టణాన్ని ఎన్నడు లేని విధ ంగా అభివృద్ధి చేసిన ఘనత కమిషనర్‌ వర్మకే దక్కిందన్నారు. మారుమూల ప్రాంతంగా , గుర్తింపులేని పుంగనూరు మున్సిపాలిటికి రాష్ట్ర స్థాయిలో అవార్డులు లభించేలా మున్సిపల్‌ కమిషనర్‌ తన సిబ్బంది , కార్మికులచే పని చేయించారన్నారు. నేడు పుంగనూరు మున్సిపాలిటి అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతోందని కొనియాడారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *