విజయనగరంలో ట్రావెల్‌ బస్సు దగ్ధం

ఎస్‌.కోట(గ్రామీణం) ముచ్చట్లు: 

విజయనగరం నుంచి తాటిపూడి మీదుగా అరకు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్‌ మినీబస్సు మంగళవారం నవోదయ విద్యాలయం సమీపంలో దగ్ధమైంది. ప్రయాణికుల కథనం ప్రకారం.. విజయనగరం ఫుట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్న 28 మంది ఉద్యోగులు అరకు చూసేందుకు మంగళవారం ఒక ప్రైవేట్‌ ట్రావెల్‌ మినీబస్సులో బయల్దేరారు. తాటిపూడి రాగానే వారంతా రిజర్వాయర్‌ చూసేందుకు బస్సు దిగి వెళ్లారు. అనంతరం బస్సు ఎక్కేందుకు వచ్చిన ప్రయాణికులతో డ్రైవర్‌ బస్సు కదలడం లేదని వెనక నుంచి బస్సును తోయాలని చెప్పాడు. దీంతో వారు తోయడంతో బస్సు కదిలింది. సుమారు కి.మీ దూరం వెళ్లాక ఒక్కసారిగా బస్సు వెనుకభాగంలో మంటలు చెలరేగాయి.దీంతో ప్రయాణికులంతా బస్సు దిగారు. దీంతో వారు ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న సుమారు రూ.20,000 విలువైన వస్తువులు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. బస్సు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి నాయుడు, పోలీసులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.కోట ఎస్సై నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *