విద్యార్థి నాయకుడు అధ్యక్ష పదవికి రాజీనామా.

పలమనేరు ముచ్చట్లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు క్రిష్ణప్రసాద్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత సమస్యల కారణంగా తాను అధ్యక్ష భాద్యతలు నిర్వహించలేక పోతున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని నియోజకవర్గ సమన్వయ కర్త సివి కుమార్ కు అందించానని చెప్పారు. ఇప్పటి వరకు అధ్యక్ష పదవిలో ఉంచినందుకు పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ని వీడేది లేదని ఒక సాధారణ కార్యకర్తగా ఉంటానని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *