విశాఖ భూ కుంభకోణం కేసులో ఇద్దరు అరెస్టు

విశాఖ ముచ్చట్లు:

భుకుంభకోణం కేసులో ఇద్దరు అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. ల్యాండ్ గ్రాఫర్ సుధాకర్ విశాఖ వ్యాలీ పాఠశాలకు-హైవేకు సమీపంలో ఉన్న విలువైన 24 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ. 4.5 కోట్లు తీసుకొని అమ్మారన్న ఆరోపణలపై చెరుకూరి సుధాకర్‌రాజుపై పీఎం పాలెంలో కేసు నమోదు అయింది. ఈ కేసులో అప్పటి జిల్లా రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు, రిటైర్డ్‌ సబ్‌రిజిస్ట్రార్‌ సత్యనారాయణరావులను అరెస్ట్‌ చేశారు. సుధాకర్‌రాజుతో కలిసి భూఅమ్మకానికి సహకరించారని ఆరోపణలు రావడంతో ఈ మేరకు వారిని అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *