వృద్ధి రేటుకు ‘ఫిచ్‌’ కోత!

భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను తగ్గిస్తున్న వివిధ సంస్థల జాబితాలో తాజాగా అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం ఫిచ్‌ చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 6.9%గా అంచనావేసింది.

ఇంతక్రితం ఈ అంచనా 7.4%. డీమోనిటైజేషన్, జీఎస్‌టీ అమల్లో క్లిష్టత వంటి అంశాలు ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల కాలంలో వృద్ధిని వెనక్కులాగినా, తదుపరి ఆరు నెలల కాలంలో ఆర్థిక వ్యవస్థ కొంత మెరుగవుతుందన్న అభిప్రాయాన్ని ఫిచ్‌ వ్యక్తం చేసింది. మొండి బకాయిల సమస్య ఆందోళన కలిగిస్తున్న మరో అంశంగా పేర్కొంది. గతేడాది భారత్‌ 7.1% వృద్ధిని సాధించింది.

వృద్ధికి ‘డిజిటల్‌’ దన్ను!: మోర్గాన్‌ స్టాన్లీ
కాగా భారత్‌ వృద్ధికి రానున్న కాలంలో ‘డిజిటలైజేషన్‌’ వరం కానుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం– మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. ఈ దన్నుతో దేశం 2027 నాటికి 6 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా (ప్రస్తుతం దాదాపు 2.5 ట్రిలియన్‌ డాలర్లు) ఆవిర్భవిస్తుందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *