వెనక్కి తగ్గిన రేవంత్‌..!

టీడీఎల్పీ నేత హోదాలో తెదేపా-భాజపా సమావేశాన్ని తానే నిర్వహిస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఆ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. నేటి మధ్యాహ్నం గోల్కొండ హోటల్‌లో జరగబోయే ఈ సమావేశానికి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే హోదాలో హాజరయ్యే అవకాశం ఉంది. తొలుత తన నేతృత్వంలో సమావేశం నిర్వహించాలనుకున్న ఆయన తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. తెతెదేపా అధ్యక్షుడు రమణ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. తెతెదేపా ఎమ్మెల్యేంతా గోల్కొండ హోటల్‌లో సమావేశానికి హాజరవుతారని ఆ పార్టీ నేత సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.

గత కొన్ని రోజులుగా తెతెదేపాలో రేవంత్‌రెడ్డి వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసినట్లు వార్తలు రావడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై స్పందించిన తెదేపా.. రేవంత్‌రెడ్డిని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవితో పాటు తెదేపా శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు పార్టీ నుంచి అందిన నివేదికను జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆమోదించినట్లు తెదేపా తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌. రమణ తెలిపారు. రేవంత్‌రెడ్డికి టీడీఎల్‌పీ అధ్యక్షుడిగా కొనసాగే నైతిక హక్కు లేదని, పార్టీ సమావేశాల్లో పాల్గొనరాదన్న తమ నివేదికను చంద్రబాబు ఆమోదించారని చెప్పారు. దీంతో నేడు రేవంత్‌ రెడ్డి తెదేపా ఎమ్మెల్యేగానే హాజరవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *