వైఎస్సాఆర్సీపి రాష్ట్ర కార్యదర్శులుగా కొండవీటి నాగభూషణం, నాగరాజరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు

వైఎస్సాఆర్సీపి రాష్ట్ర కార్యదర్శిగా పుంగనూరుకు చెందిన కొండవీటి నాగభూషణంను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పుంగనూరు ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుంగ శిష్యుడైన కొండవీటి నాగభూషణంను రెండవ సారి రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది. అలాగే రాష్ట్ర కార్యదర్శిగా పుంగనూరుకు చె ందిన మాజీ ఏఎంసీ చైర్మన్‌ నాగరాజరెడ్డిని కూడ నియమించారు. కాగా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో చిత్తూరు జిల్లాకు చెందిన కుమార్‌రాజ, షేక్‌సలీంబాషా, కె.సురేంద్రబాబులకు చోటు లభించింది. ఈ సందర్భంగా కొండవీటి నాగభూషణం మాట్లాడుతూ పెద్దిరెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ముచేయకుండ ఆయన బాటలో పార్టీ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్మొహన్‌రెడ్డిని ఎన్నుకునే ందుకు ప్రతి ఒక్కరు ఉధ్యమించాలని , పార్టీ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *