వైఎస్‌ జగ న్మోహన్‌రెడ్డిని కలసిన పుంగనూరు ముస్లిం నేతలు


హైదరాబాద్‌ ముచ్చట్లు

వైఎస్సాఆర్‌సిపి అధినేత వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డిని పుంగనూరు ముస్లిం నేతలు కలిశారు. లోటస్‌పాండ్‌లోని వైఎస్‌ జగన్‌ నివాసానికి పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడుగా నియమితులైన ఖాదర్‌బాషాను, పుంగనూరు ముస్లిం నేతలను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జగన్‌తో ముస్లిం నేతలు ముచ్చటించారు. రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల మద్దతు పూర్తి స్థాయిలో అందిస్తామని ఖాదర్‌బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు ఎమ్మెల్యే నారాయణస్వామి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి, చిత్తూరు ఇన్‌చార్జ్ జంగాలపల్లి శ్రీనివాసులు, పుంగనూరు ముస్లి కౌన్సిలర్లు ఇబ్రహిం, ఆసిఫ్‌, ఎంఎస్‌.సలీం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *