వైఎస్ జగన్ రోడ్‌ షోలో తొక్కిసలాట

అనంతపురం ముచ్చట్లు:

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ధర్మవరంలో జగన్ రోడ్ షో జరిగింది. ఈ రోడ్‌లో భారీగా జనాలు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. అప్రమత్తమైన వైసీపీ కార్యకర్తలు అత్యవసర చికిత్సకై మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలంటూ గత 37 రోజులుగా దీక్ష చేస్తున్న నేతన్నలకు జగన్ సంఘీభావం తెలిపారు. అనంతరం నేతన్నలు దీక్ష విరమింపజేశారు. కాగా అంతకముందు సీతారాంపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటపొలాలను జగన్ మోహన్ రెడ్డి పరిశీలించారు.

పంట నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని జగన్ డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *