వైభవంగా కేదార మంగళ గౌరి నోముల వ్రతం

పెద్ద పంజాణి ముచ్చట్లు

కార్తీక మాసం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు భక్తులు కేదార మంగళ గౌరి నోముల వ్రతాన్ని వైభవంగా జరుపుకున్నారు. మండలంలోని చెన్నారెడ్డి పల్లె, రాయలపేట, వీరప్పల్లె, ముత్తుకూరు, కరసనపల్లె గ్రామాలలో వెలసిన కేదారేశ్వర ఆలయాలలో అర్చకుల మంత్రోచ్ఛారణలతో శివలింగాలకు పూజలు నిర్వహించారు. ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో మంగళ గౌరి నోముల వ్రతాన్ని అమ్మవారికి నోములు సమర్పిచుకున్నారు. కేదారేశ్వర మంగళ గౌరీ అమ్మవార్ల నోముల వృత్తాంతాన్ని ఆలయ అర్చకులు వివరించారు. భక్తులు ఆ వృత్తాంతాన్ని ఆద్యంతం శ్రద్దాసక్తులతో ఆలకించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *