ఆర్యవైశ్యరత్న ఎస్‌పి.మునస్వామిశెట్టి సేవలు మరువలేనిది

పుంగనూరు ముచ్చట్లు

ఆర్యవైశ్యరత్న బిరుదాంకితుడు దివంగత ఎస్‌పి.మునస్వామిశెట్టి సేవలు మరువలేనిదని ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శుభారాం ట్రస్ట్ అధినేత సన్నుతి రామ్మూర్తిశెట్టి, పుంగనూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ శ్రీనాథరెడ్డి కొనియాడారు. మునస్వామిశెట్టి సంస్మరణ సభను ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు ముల్లంగి విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి.మునస్వామిశెట్టి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పలువురు మునస్వామిశెట్టి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు పిఎల్‌.శ్రీధర్‌,పిఎల్‌.ప్రసాద్‌, ఆర్‌వి.బాలాజి, సుకుమార్‌, యల్లంపల్లి అమరనాథ్‌, బాలసుబ్రమణ్యం , మహిళ సంఘ నాయకురాలు సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *