వైసిపి జిల్లా బిసి సెల్ ప్రధాన కార్యదర్శిగా కిషోర్ నియామకం

పలమనేరు ముచ్చట్లు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బిసి సెల్ ప్రధాన కార్యదర్శి గా మొగసాల కిషోర్ నియమితులయ్యారు. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర బిసి సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ తనను ఎంపిక చేశారని శుక్రవారం నాడు కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు శాసన సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి లోని తన కార్యాలయంలో నేడు నియామక పత్రం అందజేశారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి ని కలిసిన వారిలో జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి సుహేబ్, పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు క్రిష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *