వైసిపి నాయకుడి మృతికి పెద్దిరెడ్డి నివాళి

పలమనేరు ముచ్చట్లు

పలమనేరు మునిసిపాలిటీ పరిధిలోని 14 వ వార్డు కౌన్సిలర్ శాంతమ్మ భర్త నీళ్లకుంట మణి అలియాస్ సుబ్రమణ్యం సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వేలూరు సియంసి కి తరలించినా ప్రయోజనం లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులు స్వగ్రామమైన బొమ్మిదొడ్డికి తీసుకొచ్చారు. మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మృతుడి స్వగ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన వెంట పలమనేరు కోఆర్డినేటర్లు రాకేష్ రెడ్డి భార్య యామినిరాకేష్ రెడ్డి,సివిశారదాకుమార్,మొగసాల క్రిష్ణమూర్తి,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెంకటేగౌడ,పట్టణ మాజీ ఎంపిపి రాజేంద్ర,జిల్లా ప్రధాన కార్యదర్శి కూర్మాయి చెంగారెడ్డి, పెద్ద పంజాణి మండల కన్వినర్ బాగారెడ్డి,మండీ సుధ,బాలాజీ నాయుడు,బాలగుర్నాదం, జిల్లా మైనారిటీ కార్యదర్శి సుహేబ్,యరబల్లి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *